ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

corona bulletin: రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు..

health bulletin: గత 24 గంటల్లో రాష్ట్రంలో 141 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్థారించారు. మొత్తం 11,571 సాంపిల్స్​ను పరీక్షించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్​ను విడుదల చేసింది.

carona bulletin
కరోనా హెల్త్​ ​బులెటిన్

By

Published : Mar 1, 2022, 5:56 PM IST

Updated : Mar 1, 2022, 6:23 PM IST

corona news: రాష్ట్రంలో గత 24 గంటల్లో 11,571 సాంపిల్స్​ను పరీక్షించగా 141 మందికి కొవిడ్​ సోకినట్లు గుర్తించారు. గడిచిన ఒక్క రోజులో కృష్ణా, గుంటూరు జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనా బారినపడి మరణించారు. 450 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,31,17,181 సాంపిల్స్​ను పరీక్షించారు.

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona cases in India: దేశంలో కరోనా వ్యాప్తి భారీగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 6,915 మందికి మహమ్మారి సోకగా.. 16,864 మంది కోలుకున్నారు. 180 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 92,472గా ఉంది.

మొత్తం కేసులు: 4,29,31,045

మొత్తం మరణాలు: 5,14,023

యాక్టివ్​ కేసులు: 92,472

కోలుకున్నవారు: 4,23,24,550

Vaccination in india:

దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. సోమవారం మరో 18,22,513 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,77,70,25,914కు చేరింది.

World Corona cases:

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 11,01,750 కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసులు 43,70,89,748కి.. మరణాలు 59,75,048కి చేరుకున్నాయి. రష్యా, జర్మనీ, బ్రెజిల్ దేశాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

జర్మనీలో కొత్తగా 95,396 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 118 మంది కరోనాకు బలయ్యారు.

అమెరికాలో కొత్తగా 32,918 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా మరో 710 మంది ప్రాణాలు కోల్పోయారు.

రష్యాలో తాజాగా 1,06,920 కరోనా కేసులు నమోదయ్యాయి. 733 మంది ప్రాణాలు కోల్పోయారు.

బ్రెజిల్​లో కొత్తగా 248 మంది చనిపోయారు. 19,516 కేసులు వెలుగుచూశాయి.

ఫ్రాన్స్​లో కరోనా మహమ్మారి ధాటికి మరో 232 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 13,483 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

ఇదీ చదవండి: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో భారతీయ విద్యార్థి మృతి

Last Updated : Mar 1, 2022, 6:23 PM IST

ABOUT THE AUTHOR

...view details