ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 1,949 కరోనా కేసులు, 10 మరణాలు - covid-19 news

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా 1,949 మంది కరోనా బారిన పడగా బాధితుల సంఖ్య 1,99,276 కు చేరింది.

తెలంగాణలో మరో 1,949 కరోనా కేసులు, 10 మరణాలు
తెలంగాణలో మరో 1,949 కరోనా కేసులు, 10 మరణాలు

By

Published : Oct 4, 2020, 9:45 AM IST

తెలంగాణలో కరోనా కేసులు 2 లక్షలకు చేరువయ్యాయి. కొత్తగా 1,949 కొవిడ్​ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం 1,99,276 మంది వైరస్​ బారిన పడ్డారు. ఇప్పటివరకు కరోనాతో 1,163 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 2,366 మంది డిశ్చార్జ్​ అయ్యారు. మొత్తం 1,70,212 మంది బాధితులు కొవిడ్‌ను జయించారు.

ప్రస్తుతం 27,901 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా... హోం ఐసొలేషన్‌లో 22,816 మంది ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 291 మంది తాజాగా వైరస్‌ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 156, మేడ్చల్ జిల్లాలో 150 కరోనా కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 124, కరీంనగర్ జిల్లాలో 114 మంది కొవిడ్​ బారిన పడ్డారు.

ఇవీ చూడండి: రేపు దిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ!

ABOUT THE AUTHOR

...view details