తెలంగాణ వ్యాప్తంగా లక్షా 8 వేల 696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,384 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. మరో 1847 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. తాజా పాజిటివ్‌లతో కలిపి ఇప్పటివరకు 5,83,228 మందికి వైరస్ సోకింది. మరో 2,242 మంది కోలుకోగా మహమ్మారి నుంచి ఇప్పటివరకు 5,46,536 మంది సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా 17 మందిని కరోనా బలితీసుకోగా వైరస్ మరణాలు 3,313కి పెరిగాయి.
Corona Cases: తెలంగాణలో కొత్తగా 2,384 కరోనా కేసులు, 17 మరణాలు - telangana covid cases
తెలంగాణలో కొత్తగా 2,384 కరోనా పాజిటివ్ కేసులు, 17 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 8 వేల 696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,384 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 33,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 33,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక తాజాగా వచ్చిన కేసుల్లో ఆదిలాబాద్ 11, భద్రాద్రికొత్తగూడెం 113, జీహెచ్ఎంసీ 307, జగిత్యాల 41, జనగామ 33, జయశంకర్ భూపాలపల్లి 57, జోగులాంబ గద్వాల్ 44, కామారెడ్డి 13, కరీంనగర్ 103, ఖమ్మం 167, ఆసిఫాబాద్ 15, మహబూబ్ నగర్ 81, మహబూబాబాద్ 94, మంచిర్యాల 75, మెదక్ 23, మేడ్చల్ మల్కాజ్గిరి 116, ములుగు 45, నాగర్‌కర్నూల్ 28, నల్గొండ 170, నారాయణ పేట్ 13, నిర్మల్ 9, నిజామాబాద్ 21, పెద్దపల్లి 95, రాజన్న సిరిసిల్ల 45, రంగారెడ్డి 135, సంగారెడ్డి 59, సిద్దిపేట 102, సూర్యాపేట 90, వికారాబాద్ 54, వనపర్తి 45, వరంగల్ రూరల్ 63, వరంగల్ అర్బన్ 86, యాదాద్రి భువనగిరిలో 31 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.