తెలంగాణలో కరోనా కేసులు నిన్న కాస్తా తగ్గుముఖం పట్టినప్పట్టికీ నేడు మళ్లీ పెరిగిపోయాయి. కొత్తగా 2,166 కరోనా కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 309 కరోనా కేసులు నమోదు కాగా... వీటితో కలిపి కరోనా కేసుల సంఖ్య 1,74,774కు చేరింది. ఇప్పటివరకు కొవిడ్ బారిన పడి 1052 మంది మృతి చెందారు.
తగ్గినట్టే తగ్గి.. పెరుగుతున్న మహమ్మారి - తెలంగాణలో ఈరోజు కరోనా కేసులు తాజా వార్తలు
తెలంగాణలో కరోనా కేసులు నిన్న కాస్తా తగ్గుముఖం పట్టినప్పట్టికీ నేడు మళ్లీ కేసుల సంఖ్య పెరిగింది. కొత్తగా 2,166 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు కాగా.. 2,143 మంది కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో కరోనా కేసులు
కరోనా నుంచి మరో 2,143 మంది కోలుకోగా... ఇప్పటివరకు వైరస్ బారినుంచి కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 1,44,073 మందికి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 29,649 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. హోం ఐసోలేషన్‌లో 22,620 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇవీ చూడండి...