తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు ప్రజలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 1018 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,357కి చేరింది. బుధవారం వైరస్ బారినపడి మరో ఏడుగురు మృతిచెందంగా... ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 267కి పెరిగింది. బుధవారం వైరస్ బారి నుంచి 778మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9008 మంది చికిత్సపొందుతున్నారు.
తెలంగాణ: ఒక్క రోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు - తెలంగాణ వార్తలు
తెలంగాణలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1018 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 881 ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో 36, రంగారెడ్డి జిల్లాలో 33, మహబూబ్‌నగర్ 10, వరంగల్ గ్రామీణం 9, మంచిర్యాల 9, ఖమ్మం జిల్లాలో 7, నల్గొండ 4, జగిత్యాల 4, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో 3.. సంగారెడ్డి, కరీంనగర్, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున కరోనా కేసుల నమోదయ్యాయి. మెదక్, ఆసిఫాబాద్, ములుగు, ఆదిలాబాద్, యాదాద్రి జిల్లాల్లో 2 చొప్పున కరోనా కేసులు వెలుగు చూడగా, గద్వాల జిల్లాలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.
ఇవీ చదవండి:ఆశలు రేపుతున్న కరోనా వ్యాక్సిన్.. అతి త్వరలో రాబోతోంది..