గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,905 కరోనా కేసులు, 16 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 8,17,679కి చేరింది. వైరస్ కారణంగా మృతి చెందినవారి సంఖ్య 6,659 కి ఎగబాకింది. మరో 3,243 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా... ఇప్పటివరకు కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య 7,84,752కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,268 క్రియాశీల కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 88,778 కరోనా పరీక్షలు నిర్వహించగా... మొత్తం పరీక్షల సంఖ్య 78.62 లక్షలకు పెరిగింది.
జిల్లాల వారీగా కరోనా కేసులు..
పశ్చిమగోదావరిలో అత్యధికంగా 494 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరిలో 414, కృష్ణాలో 361, గుంటూరులో 359, చిత్తూరులో 259, అనంతపురంలో 221, ప్రకాశంలో 206, కడపలో 191, విశాఖలో 119, నెల్లూరులో 96, శ్రీకాకుళంలో 90, కర్నూలులో 25, విజయనగరంలో 70 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.
జిల్లాల వారీగా కరోనా మృతులు..
కొవిడ్‌తో కృష్ణాలో ముగ్గురు మృతి చెందారు. అనంతపురం, చిత్తూరు, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. గుంటూరు, నెల్లూరు, విశాఖ, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు.
ఇదీ చదవండి:
మందు బాబులకు శుభవార్త.. మద్యం ధరలు తగ్గించిన సర్కారు