గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 31,743 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 162 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి మరో 186 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,049 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
AP CORONA CASES : రాష్ట్రంలో నిలకడగా కరోనా కేసులు.. కొత్తగా 162 మందికి పాజిటివ్ - corona active cases
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. కొత్తగా 162 మందికి వైరస్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఎవరూ మరణించకపోవడం ఊరట కలిగిస్తోంది.
కొత్తగా 162 మందికి పాజిటివ్
జిల్లాల వారీగా కరోనా కేసులు..
అనంతపురంలో 9, చిత్తూరులో 19, తూర్పుగోదావరిలో 22, గుంటూరులో 17, కడపలో 3, కృష్ణాలో 15, కర్నూలులో 1, నెల్లూరులో 11, ప్రకాశంలో 3, శ్రీకాకుళంలో 13, విశాఖపట్నంలో 17, విజయనగరంలో 2, పశ్చిమగోదావరిలో 30 కేసులు నమోదయ్యాయి.
ఇదీచదవండి.