తెలంగాణలో కరోనా క్రియాశీల కేసులు 27 వేలు దాటగా.. ప్రస్తుతం 27 వేల 861 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 446 కేసులు నమోదవగా... మేడ్చల్‌లో 314, నిజామాబాద్‌లో 279 కేసులు వెలుగుచూశాయి.
తెలంగాణలో మరో 3,307 కరోనా కేసులు, 8 మరణాలు - corona cases
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజువారి కేసుల సంఖ్య 3వేలు దాటింది. తాజాగా 3వేల 307 మందికి కరోనా వైరస్ సోకినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న మరో 8 మరణాలు సంభవించినట్టు వెల్లడించింది.
new corona
రంగారెడ్డి జిల్లాలో 277 కేసులు, నమోదవగా... జగిత్యాలలో 155, సంగారెడ్డిలో 153, నిర్మల్‌లో 148, కామారెడ్డిలో 128 మందికి వైరస్ సోకింది. అటు నల్గొండ జిల్లాలో 102 కేసులు, ఖమ్మంలో 101, కరీంనగర్‌లో 94, ఆదిలాబాద్‌లో 91, సిద్దిపేటలో 87, వరంగల్ అర్బన్ జిల్లాలో 86 కేసులు వచ్చినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇదీ చదవండి:ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని చంపేశాడు