కొత్త రాజధానుల నిర్మాణానికి మూలసూత్రం ఇదే..! బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన ఆస్ట్రేలియా... అందులోని 6 ప్రాంతాలు కలిపి 1901లో సమాఖ్యగా ఏర్పడ్డాయి. వీటిలో న్యూసౌత్‌వేల్స్ రాజధాని సిడ్నీ, విక్టోరియా రాజధాని మెల్‌బోర్న్ అప్పటికే పెద్ద నగరాలు. వీటిని కాదని సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా కొత్త రాజధానిని నిర్మించుకోవాలని... అది ఏ రాష్ట్రంలోనూ భాగం కాకుండా స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించారు. 1908లో సిడ్నీ, మెల్‌బోర్న్‌కు మధ్యలో 900 చదరపు మైళ్ల విస్తీర్ణాన్ని అనువైనదిగా గుర్తించారు. 1913లో నిర్మాణం ప్రాంరంభించారు. ఈ నిర్మాణంపై ప్రపంచ యుద్ధాలు ప్రభావం చూపినా... 1927లో పార్లమెంటు భవనం సహా రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభమ్యయాయి. ఆ పార్లమెంటు భవనాన్ని 1988 వరకు వినియోగించారు. సమగ్ర అభివృద్ధికి అన్ని అనుకూలతలున్న నూతన నగర నిర్మాణం ఎంత అవసరమో కాన్‌బెర్రా ఉదాహరణగా నిలుస్తుంది.
బ్రెజిల్ నూతన రాజధాని బ్రెసిలియా. 1960 ఏప్రిల్‌లో దీన్ని పారంభించారు. ఆ దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో భౌగోళిక స్థావరానికి ప్రాధాన్యం ఇచ్చి నిర్మించారు. 1763 నుంచి 1980 వరకు రియో డి జనీరో... అంతకుముందు సాల్వడార్ బ్రెజిల్‌కు రాజధానులుగా ఉండేవి. అట్లాంటిక్ తీరంలోని ఆ నగరం దేశ ప్రజలందరికీ సమస్థాయిలో అందుబాటులో లేకపోవడం, ఇరుకైపోవడం, రద్దీ పెరగడం, శత్రుదాడులకు అనుకూలంగా ఉండటం వంటి కారణాలతో 1960లో రాజధానిని బ్రెసిలియాకు మార్చారు. 1956లో నిర్మాణం ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేశారు. సరికొత్త ప్రణాళికలతో నూతన రాజధానుల దిశగా ఆలోచన చేసేలా బ్రెసిలియాను నిర్మించారు.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత 1991లో... కజకిస్థాన్ స్వతంత్ర్య దేశంగా ఆవిర్భివించింది. అప్పటికే ఆ ప్రాంతానికి అల్మాటి రాజధానికిగా ఉండేది. ఆ నగరం విస్తరించడానికి అవకాశం లేకపోవడం, చైనా సరిహద్దు దగ్గరాగా ఉండటం భూకంప ముప్పు.... దేశ ఆగ్నేయ దిశలో మూలన ఉండటం... వంటి కారణాలతో కొత్త రాజధాని నిర్మాణం వైపు మొగ్గు చూపారు. 1997 డిసెంబర్లో అల్మాటి నుంచి ఉత్తరంగా 1200 కిలోమీటర్ల దూరంలోని ఆస్థానకు రాజధానిని మార్చారు. 2019లో ఈ రాజధాని పేరును ఆ దేశ మాజీ అధ్యక్షుడు నూర్ సుల్తాన్‌గా నామకరణం చేశారు.
భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలతో సరిహద్దును పంచుకున్న మయన్మార్ నూతన రాజధాని నేపిడా. 1948 నుంచి 2005 వరకూ యాంగూన్ ఆదేశానికి రాజధానికి. యాంగూన్ నుంచి ఉ్తతరంగా 320 కిమీ దూరంలోని నేపిడాకు 2005లో రాజధానిని మార్చారు. 1947లో భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయిన తర్వాత రాజధానికిగా కరాచీ కొనసాగింది. అయితే ఈ నగరం దేశానికి ఓ చివరన సముద్రతీరంలో ఉండటం, జనసమర్థంగా నిండిపోవడంతో వ్యూహాతంగా జమ్ముకశ్మీర్‌కు దగ్గర్లోని ఇస్లామాబాద్‌ను 1960లో నిర్మించారు. ఇది అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరం.
నైజీరియాకు మొదట్లో లాగోస్ రాజధానిగా ఉండేది. ఇది జనసమ్మర్థంగా కిక్కిరిసిపోయిన కారణంగా 1991 నుంచి అబుజా రాజధానిగా పాలన సాగిస్తున్నారు. 1980లలో ప్రణాళికబద్దంగా నిర్మించిన నగరం ఇది. భౌగోళికంగా అన్ని అనుకూలతలున్న నగరం. దేశంలోని ప్రజలందరికీ అందుబాటులో ముఖ్యంగా దేశం మధ్యలో ఉండటం, వేర్వేరు ప్రాంతాల వారికి ఆమోదంగా ఉండటం, ఆర్థికంగా అభివృద్ధి చెందే సామర్థ్యం... ఇలా అనేక కారణాలతో వివిధ దేశాలు నూతన రాజధానులు ఆలోచన చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాయి.