facebook crime story : ప్రియుడిని చంపించిన వివాహిత కేసులో కొత్త కోణం బయటపడింది. మొదట ప్రియుడిని హత్య చేయించాలని పథకం పన్నిన శ్వేతారెడ్డి చివరి నిమిషంలో హత్యచేయవద్దని మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. కానీ అప్పటికే సుత్తితో కొట్టడంతో... బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడని సమాచారం. తల వెనక కొడితే మతిస్థిమితం కోల్పోతాడనే దాడి చేశామంటూ నిందితులు పోలీసుల ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ ప్రశాంత్‌హిల్స్‌కు చెందిన.. శ్వేతారెడ్డికి 2015లోవివాహమైంది. బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న ఆమెకు.. నాలుగేళ్ల క్రితం బాగ్‌అంబర్‌పేట్‌కి చెందిన ఫొటోగ్రాఫర్ యశ్మకుమార్‌తో ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. నెలక్రితం యశ్మకుమార్.. పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఇప్పటికే అత్యంత సన్నిహితంగా ఉంటున్నందున వివాహబంధంతో ఒక్కటవుదామని చెప్పాడు. యశ్మకుమార్ ప్రతిపాదనకు శ్వేతారెడ్డి నిరాకరించింది. బలవంతంగానైనా పెళ్లికి ఒప్పించాలని అనుకున్న యశ్మకుమార్...తన వద్ద ఫొటో, వీడియోలను బయటపెడతామని హెచ్చరించడంతో అతడిని ఎలాగైనా అంతమొందించాలని పథకం వేసింది.