తెలంగాణలో తాజాగా 691 మందికి కరోనా వైరస్ (corona) సోకినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 6,38,721 కి చేరింది. తాజాగా మహమ్మారితో ఐదుగురు మృతి చెందగా మొత్తం సంఖ్య 3,771కి పెరిగింది.
తెలంగాణలో కొత్తగా 691 కరోనా కేసులు
By
Published : Jul 21, 2021, 11:10 PM IST
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,14,260 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 691 కొత్త కేసులు (corona cases) నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఐదుగురు మరణించారు. ఇప్పటి వరకు నమోదైన కేసులతో కలిపి మొత్తం సంఖ్య 6,38,721 కి చేరింది.
మహమ్మారి బారి నుంచి మరో 565 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 6,25,042 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇవాళ మరణించిన ఐదుగురితో కలిపి మొత్తం సంఖ్య 3,771కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,908 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా కేసుల్లో అత్యధికంగా 85 కేసులు జీహెచ్‌ఎంసీలో నమోదయ్యాయి. జిల్లాల వారీగా వచ్చిన కేసులను పరిశీలిస్తే... ఇలా ఉన్నాయి.