గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 41,244 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు(corona tests) నిర్వహించగా... కొత్తగా(ap corona cases) 348 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కొవిడ్ నుంచి 358 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,220 కొవిడ్ యాక్టివ్ కేసులు(covid active cases in ap) ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,98,46,690 సాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 348 కరోనా కేసులు.. 3 మరణాలు - ఏపీలో తాజా కరోనా కేసులు
రాష్ట్రంలో(ap corona cases) గడిచిన 24 గంటల్లో 348 కరోనా పాజిటివ్ కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3,220 యాక్టివ్ కేసులు(corona active cases) ఉన్నాయి. ఈ మేరకు వైద్యాధికారులు వెల్లడించారు.
ఏపీలో కొత్తగా 348 కరోనా కేసులు