తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో తాజాగా 2,207 కరోనా కేసులు నమోదు కాగా.. 12 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 75,257కు చేరింది. 601 మంది మహమ్మారితో మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకుని మరో 1,136 మంది డిశ్చార్జి కాగా.. వారి సంఖ్య 53, 239కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,417 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కొత్తగా 23,495 కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా ఇప్పటివరకు 5,66,984 కరోనా పరీక్షలు చేశారు.
తెలంగాణపై కరోనా పంజా.. కొత్తగా 2,207 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 2,207 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 12 మంది మృతి చెందారు.
తెలంగాణలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 532 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా 196, వరంగల్ నగరం 142, మేడ్చల్ జిల్లాలో 136, కామారెడ్డి 96, కరీంగర్ 93, నిజామాబాద్ 89, జోగులాంబ గద్వాల జిల్లాలో 87 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. అలాగే ఖమ్మం జిల్లాలో 85 మంది, భద్రాద్రి కొత్తగూడెం 82 , పెద్దపల్లి 71, జనగామ జిల్లాలో 60 మంది వైరస్ బారిన పడ్డారు.