ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త 108, 104 వాహనాలను ఇవాళ ప్రారంభించనున్న సీఎం - ఏపీలో కొత్తగా 108 104 వాహనాలు

ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెస్తున్న 108, 104 వాహనాలను సీఎం జగన్​ ఇవాళ ప్రారంభించనున్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వైఎస్సార్ తెచ్చిన 108, 104 సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆయన అన్నారు. ప్రతి మండలంలో ఒక 108, 104 వాహనం అందుబాటులో ఉంటాయని మంత్రి చెప్పారు.

'కొత్త 108, 104 వాహనాలను రేపు ప్రారంభించనున్న సీఎం'
'కొత్త 108, 104 వాహనాలను రేపు ప్రారంభించనున్న సీఎం'

By

Published : Jun 30, 2020, 2:56 PM IST

Updated : Jul 1, 2020, 2:19 AM IST

నూతన 108, 104 వాహనాలను సీఎం జగన్ ఇవాళ ప్రారంభిస్తారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. దివంగత నేత వై.ఎస్​ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108, 104 వాహనసేవలు.. లక్షల మంది ప్రాణాలను కాపాడాయని మంత్రి చెప్పారు.

108, 104 వాహన సేవలను మరింత మెరుగుపరుస్తామన్న ఆయన.. ప్రతి మండలంలో ఒక 104, 108 వాహనం అందుబాటులోకి తెస్తామన్నారు. రూ.201 కోట్ల వ్యయంతో కొత్త వాహనాలు అందుబాటులోకి తెచ్చామని ఆళ్ల నాని స్పష్టం చేశారు. 108 సేవల కోసం 412 కొత్త వాహనాలు, 104 వాహన సేవల కోసం 656 కొత్త వాహనాలు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు.

Last Updated : Jul 1, 2020, 2:19 AM IST

ABOUT THE AUTHOR

...view details