తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం గంగబండ తండాలో.. సోనా అనే 54 సంవత్సరాల మహిళ అనారోగ్యంతో తెల్లవారుజామున మృతి చెందింది. ఆమె తోటి కోడలు చక్రి (46)... అక్కని చూడగానే ఒక్కసారిగా కింద పడిపోయింది.
వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు. తోటికోడళ్ల మధ్య ఉన్న ప్రేమే ఈ విషాదానికి కారణమని గ్రామస్థులు చెప్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవటం వల్ల తండాలో విషాదం అలుముకుంది.