NEERUKONDA REJECTED AMRAVATI CORPORATION: అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనను నీరుకొండలో జరిగిన గ్రామసభ వ్యతిరేకిస్తూ తీర్మానించింది. నీరుకొండను అమరావతి కార్పొరేషన్‌లో కలిపేందుకు గ్రామస్తులు నిరాకరించినట్లు.. మంగళగిరి ఎంపీడీవో రాంప్రసన్న అధికారికంగా ప్రకటించారు. నేడు జరిగిన రెండు గ్రామసభల్లోనూ ప్రజలు ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు ఆయన వెల్లడించారు. 19 గ్రామాలతో కాకుండా.. 29 గ్రామాలతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు అభిప్రాయపడినట్లు స్పష్టం చేశారు.
కురుగల్లులో సేమ్ సీన్..
అమరావతి కేపిటల్ సిటీని మునిసిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయడం కోసం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా.. కురుగల్లులోనూ గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో గ్రామస్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ గ్రామసభలో మంగళగిరి ఎంపీడీవో రాంప్రసన్న నాయక్.. అమరావతి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు గురించి వివరించారు. అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుతో సీఆర్డీఏకు నష్టం లేదని ఆయన అన్నారు. సీఆర్డీఏ అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు.