నీరబ్కు బాధ్యతలు అప్పగించిన ఎల్వీ - lv subrahmanmyam
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ఛార్జ్ తీసుకున్నారు. ఎల్వీ సుబ్రమణ్యం.. నీరబ్ కు బాధ్యతలు అప్పగించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా.. సీసీఎల్ఏ నీరబ్ కుమార్.. బాధ్యతలు తీసుకున్నారు. ఇన్చార్జ్ సీఎస్‌గా ఆయన కొనసాగనున్నారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ని మానవవనరుల అభివృద్ధి కేంద్రానికి పంపించింది. వారం రోజుల్లో సీఎస్ బాధ్యతలను సీసీఎల్‌ఏకు అప్పగించాలని ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది. సర్కారు ఆదేశాల మేరకు ప్రధానకార్యదర్శి బాధ్యతలను భూపరిపాలన ప్రధాన కమిషనర్ నీరబ్ కుమార్‌కు అప్పగించారు. ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ కొంత వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.