తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఇసుక బావి వద్ద మురుగుకాలువపై వరద ఉద్ధృతికి ఓ వ్యక్తి కారుతో సహా కొట్టుకుపోయిన ఘటనలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉదయం నుంచి గాలిస్తున్నారు. మురుగు కాలువలో విరిగిన చెట్లు, చెత్తాచెదారం పేరుకుపోవడం వల్ల వెతుకులాటకు అడుగడుగునా ఆటంకం కలుగుతోంది.
హిటాచి సాయంతో చెత్తాచెదారాన్ని తొలగిస్తూ... ఎన్టీఆర్ఎఫ్ బృందం ముందుకు సాగుతున్నారు. ఎక్కడ చెత్తాచెదారం పెద్దఎత్తున పేరుకుపోయిందో అక్కడ కారు చిక్కుకుపోయిందేమోనని సిబ్బంది వెతుకుతున్నారు.