ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటుతున్న శరన్నవరాత్రుల ఉత్సవాలు - కడప

Navaratri: కరోనా కారణంగా రెండు సంవత్సరాలు శరన్నవరాత్రులకు దూరమైన భక్తులు ఈ సంవత్సరం ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తూ భక్తులకు అభయన్నిస్తున్నారు. వివిధ రూపాలలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు.

Navaratri Celebrations
దసరా ఉత్సవాలు, శరన్నవరాత్రులు

By

Published : Oct 2, 2022, 8:54 AM IST

Navaratri Celebrations in Ap: రాష్ట్ర వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కోలాటాలు, మేళతాళాలతో ఊరేగింపులు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో దేవీ ఉత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి. వివిధ రూపాల్లో అలంకరించిన దుర్గమ్మను భక్తులు దర్శించుకుంటున్నారు. కరోనా కారణంగా రెండేళ్లపాటు ఉత్సవాలకు నోచుకుని దసరా పండుగను ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేవీనవరాత్రి ఉత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి. శ్రీశైలంలో ఆరోరోజు శ్రీభ్రమరాంబ దేవి కాత్యాయని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను హంస వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు.

కడపలో దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి శాలలోని వాసవి మాత భక్తులకు త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని వివిధ రకాల పూలతో బంగారు నగలతో అలంకరించారు. విజయదుర్గాదేవి ఆలయం భక్తులతో కిటకిటలాడిపోయింది. బాపట్ల జిల్లా పర్చూరులో మహాలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. బాపట్లలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలోని దుర్గమ్మను 10 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు.

కర్నూలులోని చిన్న అమ్మవారిశాలలో గోదాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రులు, దసరా ఉత్సవాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details