Warangal Karimnagar PF Offices: కరోనా సమయంలో అత్యధిక మంది ఖాతాదారులకు పరిహారం చెల్లించినందుకుగాను దేశంలోని పది అత్యున్నత ప్రాంతీయ కార్యాలయాల్లో వరంగల్, కరీంనగర్‌లలోని ప్రాంతీయ భవిష్యనిధి(పీఎఫ్) కార్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. కేంద్ర లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మంత్రిత్వ శాఖ, దిల్లీ ఈపీఎఫ్ ముఖ్య కార్యాలయ అధికారులు గురువారం ప్రాంతీయ కమిషనర్లు రవితేజ కుమార్‌రెడ్డి(వరంగల్), తానయ్య(కరీంనగర్)లకు ప్రశంసాపత్రం అందించారు. కరోనా సమయంలో వరంగల్ ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది, అధికారులు సెలవు రోజుల్లోనూ పనిచేసి కేవలం 3 నుంచి 10 రోజుల్లో ఖాతాదారులకు పరిహారం చెల్లించారు.
PF Offices: అక్కడి పీఎఫ్ కార్యాలయాలకు.. జాతీయస్థాయి గుర్తింపు
Warangal Karimnagar PF Offices: కరోనా కష్టకాలంలో అత్యధిక మంది ఖాతాదారులకు పరిహారం చెల్లించినందుకుగాను దేశంలో పది అత్యున్నత ప్రాంతీయ కార్యాలయాలను ఎంపిక చేశారు. వాటిలో మన రాష్ట్రం నుంచి వరంగల్, కరీంనగర్ పీఎఫ్ కార్యాలయాలు చోటుసంపాదించాయి.
పీఎఫ్ కార్యాలయాలు
2020-21 సంవత్సరంలో 1,148 డెత్ క్లెయిమ్‌లను అందించారు. ఇవి కూడా ఖాతాదారుడు చనిపోయిన మూడు రోజుల్లోనే బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూశారు. ఈ ఏడాది సాధారణ పరిహారాలు 64,802 ఇచ్చారు. ఇందులో 99.03 శాతం కేవలం 7 రోజుల్లోనే ఖాతాదారులకు అందించారు. 2019లో కేవలం 37,000 పరిహారాలు అందించగా.. కొవిడ్ సమయంలో 64,802 అందించడం గొప్ప విషయమని రవితేజ కుమార్‌రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి :