MP RaghuRama arrest: రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం - MP RaghuRama arrest updates
15:12 June 29
రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ(NHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ రఘురామ (MP RaghuRama) అరెస్ట్ కేసులో నోటీసులు ఇచ్చినా స్పందించలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. ఆగస్టు 9వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఎంపీ రఘురామకృష్ణరాజు (MP RaghuRama) అరెస్టు వ్యవహారంలో నోటీసులు జారీచేసినా స్పందించలేదంటూ.. రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల సంఘం(National Human Rights Commission ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ (AP DGP), హోంశాఖ కార్యదర్శికి సమన్లు జారీ చేసింది. రఘురామ అరెస్టు వ్యవహారంపై నివేదిక పంపడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీసింది. ఆగస్టు 9వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలంటూ.. కండిషనల్ సమన్లు ఇచ్చింది. నిర్దేశించిన గడువులోగా నివేదిక అందించకపోతే.. ఆగస్టు 16వ తేదీన డీజీపీ, హోంశాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఇదీ చదవండి
DISHA APP: 'దిశ' యాప్ ఉంటే..మీ అన్నయ్య తోడున్నట్లే: సీఎం జగన్