ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాతీయ ఆరోగ్య మిషన్ కింద 1,900 పోస్టుల భర్తీ - national health mission recruitment 2020

జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎమ్‌) కింద ప్రభుత్వం సుమారు 1,900 పోస్టులను ఒప్పంద విధానంలో భర్తీ చేయనుంది. డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా ఈ నియామకాలను చేపట్టనున్నారు.

national health mission
national health mission

By

Published : Sep 27, 2020, 8:48 AM IST

జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎమ్‌) కింద ప్రభుత్వం సుమారు 1,900 పోస్టులను ఒప్పంద విధానంలో భర్తీ చేయనుంది. జిల్లాలవారీగా కేటాయించిన నర్సింగ్‌, పారా మెడికల్‌, ఇతర పోస్టులను అక్టోబరు 20వ తేదీలోగా భర్తీ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ భాస్కర్‌ కాటంనేని.. జిల్లా సంయుక్త కలెక్టర్లు(అభివృద్ధి), జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు.


* నోటిఫికేషన్‌ జారీ - సెప్టెంబరు 30.
* దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - అక్టోబరు 10.
* మెరిట్‌ జాబితా వెల్లడి, అభ్యంతరాల స్వీకరణ - అక్టోబరు 15న.
* రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక, తుది జాబితా వెల్లడి - అక్టోబరు 16న.
* నియామక ఉత్తర్వుల జారీ - అక్టోబరు 19న.

ABOUT THE AUTHOR

...view details