ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"చేనేతపై మాటలు కాదు.. శ్రద్ధ ఉంటే జీఎస్టీ ఎత్తేయండి.." - national handloom day 2022

ktr on handloom day: కొన ఊపిరితో ఉన్న చేనేత రంగానికి.. జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వం మరణశాసనం రాస్తోందని.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత రంగంపై పన్నులను వెంటనే రద్దు చేయాలని.. చేతులు జోడించి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నేతన్నను ఆదుకునేందుకు.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా... రైతు బీమా తరహాలో నేత కార్మికులకు బీమా సౌకర్యం నేటినుంచి అమలులోకి తీసుకొచ్చామని తెలిపారు.

ktr
ktr

By

Published : Aug 7, 2022, 8:58 PM IST

ktr on handloom day: హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా నిర్వహించింది. ఎమ్మెల్సీ ఎల్. రమణ, వరంగల్​ మేయర్ గుండు సుధారాణి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో... చేనేత, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు.. దృశ్యమాద్యమం ద్వారా ప్రసంగించారు. చరకాతో చేనేతకు ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో గాంధీ.. చాటి చెప్పారన్న మంత్రి... 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాల వేళ.. కేంద్రం జీఎస్టీ పేరుతో... చేనేత రంగానికి మరణశాసనం రాస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ktr

ఈ ఏడాది టెస్కో ఆధ్వర్యంలో రామప్ప చేనేత చీరలను ఆవిష్కరించడం గొప్ప శుభ పరిణామమని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చేనేత మిత్ర ద్వారా 50శాతం సబ్సిడీ ద్వారా ముడి సరుకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో నేటి నుంచి నేత కార్మికులను ఆదుకునేందుకు రైతు బీమా తరహాలో బీమా సౌకర్యం తీసుకువచ్చామని తెలిపారు. నేతన్న బీమా ద్వారా 8వేల మంది కార్మికులకు లబ్ది చేకూరుతుందన్నారు. ప్రమాదవశాత్తు నేత కార్మికుడు చనిపోతే పది రోజుల్లో 5లక్షల బీమా నామినికి అందిస్తామన్నారు. చేనేతను ప్రోత్సహించేందుకు ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమవారం... నేత వస్త్రాలనే ధరించాలని... మరోసారి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్... చేనేత రంగానికి ఎనలేని కృషి చేస్తున్నారని... మాజీ చేనేత మంత్రి, తెరాస ఎమ్మెల్సీ... ఎల్. రమణ తెలిపారు. ప్రతి ఒక్కరూ నేతన్నలను ఆదుకోవాలని... ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం ఆఖర్లో... హాజరైన అందరితో... ఎల్.రమణ.. చేనేత వస్త్రాలను ధరిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందు నిర్వహించిన... ఫ్యాషన్ షో ఆహుతులను ఆకట్టుకుంది.

ఇవీ చదవండి :

ISRO: ఇస్రోకు ఎదురు దెబ్బ.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగం విఫలం!

గూగుల్​ స్ట్రీట్​ వ్యూ మళ్లీ వచ్చేసింది.. మరి మీ ఇంటిని బ్లర్​ చేశారా?

ABOUT THE AUTHOR

...view details