National flag: తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు.. తమ సోషల్ మీడియా అకౌంట్ల డీపీలు మార్చారు. అందరూ జాతీయ జెండాను ఉంచారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లతోపాటు పార్టీకి సంబంధించిన అకౌంట్ల డీపీలు సైతం మార్చారు. "ఆజాదీకా అమృత్ మహోత్సవ్"లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా.. అందరూ తమ సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించిన డీపీల్లో.. త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు.. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్చర్స్ ను మార్చి.. మువ్వన్నెల జెండాను పెట్టారు. కాగా.. 'ఆజాదీకా అమృత్ మహోత్సవ్' నిర్వహణపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం దిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. చంద్రబాబు పాల్గొననున్నారు.
అధినేతతో సహా.. త్రివర్ణంగా మారిన తెదేపా సోషల్ మీడియా డీపీలు - త్రివర్ణంగా మారిన తెదేపా నేతల ఖాతాలు
National flag: తెదేపా శ్రేణుల సోషల్ మీడియా ఖాతాలన్నీ.. త్రివర్ణంతో మెరిసిపోతున్నాయి. అధినేత చంద్రబాబుతో సహా ఇతర నేతలు, కార్యకర్తలంతా.. సామాజిక మాధ్యమాల ఖాతాల్లోని డీపీలో త్రివర్ణ పతాకాన్ని ఉంచారు.
త్రివర్ణం
Last Updated : Aug 6, 2022, 1:23 PM IST