ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణకు రూ.4 కోట్ల విలువైన మందులు అందించిన నాట్కో ఫార్మా - తెలంగాణ వార్తలు

కరోనా చికిత్సలో ఉపయోగించే బారిసిటినిబ్ మందులను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేందుకు నాట్కో ఫార్మా కంపెనీ ముందుకొచ్చింది. రూ.4కోట్ల విలువైన మందులను మంత్రి కేటీఆర్​కు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ నాట్కో ఫార్మాకు కృతజ్ఞతలు తెలిపారు.

Natco Pharma
Natco Pharma

By

Published : May 15, 2021, 7:33 AM IST

కొవిడ్ చికిత్సలో వినియోగించే విలువైన బారిసిటినిబ్ మందులను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేందుకు నాట్కో ఫార్మా లిమిటెడ్ ముందుకొచ్చింది. ఈమేరకు కంపెనీ సీఈవో రాజీవ్ నన్నపనేని రూ.4.2 కోట్ల విలువైన మందులను మంత్రి కేటీఆర్​కు అందజేశారు.

కొవిడ్​పై పోరులో భాగంగా కీలకమైన మందులను ప్రభుత్వానికి అందజేసి.. బాధితుల చికిత్సకు తోడ్పాటునందించినందుకు మంత్రి కేటీఆర్ నాట్కో ఫార్మాకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details