ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP DEEKSHA: ఎన్టీఆర్ భవన్​లో 'తెదేపా నారీ సంకల్ప దీక్ష' - nari sankalpa deeksha in amaravathi

TDP DEEKSHA: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో తెలుగు మహిళా ఆధ్వర్యంలో 'తెదేపా నారీ సంకల్ప దీక్ష' ప్రారంభమైంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నిరసనగా ఈ దీక్ష చేపట్టారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఈ దీక్ష కొనసాగుతోంది.

ఎన్టీఆర్ భవన్​లో ప్రారంభమైన 'తెదేపా నారీ సంకల్ప దీక్ష'
ఎన్టీఆర్ భవన్​లో ప్రారంభమైన 'తెదేపా నారీ సంకల్ప దీక్ష'

By

Published : Jan 31, 2022, 9:29 AM IST

Updated : Jan 31, 2022, 12:17 PM IST

ఎన్టీఆర్ భవన్​లో ప్రారంభమైన 'తెదేపా నారీ సంకల్ప దీక్ష'

TDP DEEKSHA:తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో తెదేపా నారీ సంకల్ప దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగానే దీక్ష చేపట్టినట్లు ఆమె తెలిపారు. రెండున్నరేళ్లలో నిత్యం మహిళలు, బాలికలపై దాడులు జరుగుతున్నా.. ముఖ్యమంత్రి జగన్ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. మద్యపాన నిషధమంటూనే..పెద్దఎత్తున దుకాణాలు తెరిచారని అనిత మండిపడ్డారు. డ్వాక్రా మహిళలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల్లో ధైర్యం నింపేందుకే సంకల్ప దీక్ష చేపట్టినట్లు ఆమె వివరించారు.

Last Updated : Jan 31, 2022, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details