ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'గ్రానైట్ అక్రమార్కులపై కేసులు పెడతాం' - రాష్ట్రంలో పన్నుల సేకరణపై నారాయణ స్వామి

గ్రానైట్ అక్రమార్కులపై కేసులు పెడతామని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పన్ను వసూళ్లు బాగా చేసిన అధికారులకు ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి తెలిపారు.

narayana swamy on tax collectin in state
రాష్ట్రంలో పన్నుల సేకరణపై నారాయణ స్వామి

By

Published : Feb 25, 2020, 4:35 PM IST

రాష్ట్రంలో పన్నుల సేకరణపై నారాయణ స్వామి

గ్రానైట్ అక్రమాలపై దృష్టి పెట్టి.. నిందితులపై కేసులు పెడతామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. వాణిజ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేబుల్ ఆపరేటర్లకు జీఎస్టీ విధింపుపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. వాణిజ్య పన్నుల శాఖ నూతన భవన నిర్మాణాన్ని చేపడతామన్నారు. పన్ను వసూళ్లు బాగా చేసిన అధికారులకు ప్రోత్సాహకాలు అందజేస్తామని మంత్రి తెలిపారు. వాణిజ్య పన్నుల ద్వారా జనవరి నాటికి రూ.36 వేల కోట్లు వసూలు చేశామని అన్నారు. మార్చి 31 నాటికి రూ.45 వేల కోట్లు వసూలు అవుతాయని అంచనా వేస్తున్నట్లు నారాయణస్వామి వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details