ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 5, 2021, 1:32 PM IST

ETV Bharat / city

మే నెలలో జరిగే అన్ని పరీక్షలు వాయిదా వేయాలి: నారాలోకేశ్

రాష్ట్రంలో మే నెలలో జరిగే అన్ని పరీక్షలు వాయిదా వేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. ఇంటర్ పరీక్షలను వాయిదా వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

నారా లోకేశ్
నారా లోకేశ్

ముఖ్యమంత్రికి రాసిన లేఖ

రాష్ట్ర పరిధిలో మే నెలలో జరిగే అన్ని పరీక్షలు వాయిదా లేదా రద్దు చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. మే నెలలో ఆఫ్​లైన్​లో జరిగే పరీక్షలను కేంద్రం ఇప్పటికే వాయిదా వేసినందునా.. రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మూడు వారాల ఆందోళన, న్యాయపోరాటం అనంతరం బుధవారం నుంచి జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

"మే నెలలో రాష్ట్ర ప్రభుత్వ పరధిలో వివిధ రకాల ప్రవేశ పరీక్షలు, కళాశాల సెమిస్టర్ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి పోటీ పరీక్షలు జరగాల్సి ఉంది. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో కరోనా పరీక్షలు నిర్వహణ లక్ష దాటటంలేదు. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో పాటు ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోతున్న ఘటనలు మీకు తెలియనివి కాదు. కరోనా తీవ్రత తగ్గుముఖం పడితే జూన్ మొదటి వారంలో పరిస్థితులు సమీక్షించి అందుకనుగుణంగా పరీక్షల నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకోవాలి."-నారా లోకేశ్

ఇవీ చదవండి:

కర్ఫ్యూ ప్రారంభం : రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఆంక్షలు

మరాఠా రిజర్వేషన్లు రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు

ABOUT THE AUTHOR

...view details