ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలు - చిత్తూరు జిల్లా లోకేశ్ జన్మదిన వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన వేడుకలను తెదేపా శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యలయంలో 40 కిలోల భారీ కేక్​ను కట్ చేశారు. తాడేపల్లి మండలం కొలనుకొండలో అనాథ పిల్లల మధ్య పుట్టినరోజు వేడుకులను నిర్వహించారు. పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం చిన్నారులకు అన్నదానం చేశారు.

అనంతపురం తెదేపా కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న పార్టీ శ్రేణులు
అనంతపురం తెదేపా కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న పార్టీ శ్రేణులు

By

Published : Jan 23, 2021, 1:53 PM IST

Updated : Jan 23, 2021, 9:48 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ నేతలు ఘనంగా నిర్వహించారు. మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో లోకేష్ పేరుతో ప్రత్యేక పూజలు చేేశారు. పార్టీ కార్యాలయంలో 40కిలోల భారీ కేక్ ను నేతలు కట్ చేశారు. తాడేపల్లి మండలం కొలనుకొండలో ఆ పార్టీ నేతలు అనాథ పిల్లల మధ్య లోకేష్ పుట్టినరోజు వేడుకులను నిర్వహించారు. పిల్లలతో కలిస్ కేక్ కట్ చేశారు. అనంతరం చిన్నారులకు అన్నదానం చేశారు. మంగళగిరిలో లోకేష్ ఓడినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని నేతలు కొనియాడారు. మంగళగిరి ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ వారికి అండగా నిలుస్తున్నారని నేతలు చెప్పారు.

జిల్లా పార్టీ కార్యాలయంలో..

గుంటూరు తెదేపా జిల్లా పార్టీ కార్యాలయంలో నారా లోకేశ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నేతలు పెద్ద రత్తయ్య , నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్, నసీర్ అహ్మద్, జయలక్ష్మి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి దిశ దశ నిర్ధేశించే వ్యక్తి నారా లోకేశ్ అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన రథసారథి వంటి వారన్నారు. పార్టీలో నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చిన లోకేశ్ అడుగుజాడలలో ప్రతిఒక్కరూ నడుచుకోవాలన్నారు.

విశాఖలో..

విశాఖ జిల్లా అనకాపల్లి లో తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ జన్మదిన వేడుకలు ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో తెదేపా నాయకులు, కార్యకర్తలు రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

అనంతపురంలో..

తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా అనంతపురంలోని తెదేపా కార్యాలయంలో శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న లోకేశ్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. నగరంలోని లలిత కళా పరిషత్​లో తెలుగు యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తం దానం చేశారు. కదిరిలోనూ లోకేశ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

రూ.40 వేల ఆర్థిక సాయం...

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు.. ఆకస్మికంగా మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రూ.40 వేలు ఆర్థిక సాయం అందించారు.

చిత్తూరులో..

నారా లోకేష్ 38వ జన్మదినోత్సవాన్ని చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఘనంగా నిర్వహించారు. 38 కిలోల కేకును కట్​ చేసి పంపిణీ చేశారు. పేదలకు అన్నదానం చేశారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు సీబీఎన్ ఆర్మీ సభ్యులు పాల్గొన్నారు. చంద్రగిరిలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

నెల్లూరులో..

నెల్లూరు జిల్లా నాయండుపేట పురపాలక సంఘం గడియారం సెంటర్లో తెలుగు యువత ఆధ్వర్యంలో తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్​ జన్మదిన వేడుకలు జరిపారు.

కృష్ణా జిల్లా నందిగామలో...

తెదేపా నాయకులు నారా లోకేశ్​ పుట్టిన రోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ పట్టణ గాంధీ సెంటర్‌లో కేక్ కటింగ్‌, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా పలువురు నేతలు పాల్గొన్నారు.

అవనిగడ్డలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేశ్​ జన్మదిన వేడుకలను నియోజకవర్గ ఇంచార్జి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

విజయనగరంలో..

నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలు విజయనగరం అశోక్ బంగ్లా లో తెదేపా జిల్లా ఇంచార్జ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెదేపా పాలిట్​బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు.. నారా లోకేశ్​ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చీపురుపల్లిలో విజయనగరం జిల్లా నియోజకవర్గ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

ప్రకాశం జిల్లాలో..

ప్రకాశం జిల్లా కనిగిరిలో తేదేపా అగ్ర నాయకులు నారా లోకేశ్​ జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లాలో ..

మాజీ మంత్రి లోకేశ్ పుట్టినరోజు వేడుకలను శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించిన లోకేశ్ పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు. యువతను స్ఫూర్తిదాయకంగా ముందుండి నడిపేపించే నాయకుడు నారా లోకేశ్​‌ అని ఎంపీ పేర్కొన్నారు.

కర్నూలులో..

కర్నూలులోని అన్ని నియోజక వర్గాల్లో నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

కడపలో..

నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను తెదేపా ఎమ్మెల్సీ బీ.టెక్ రవి ఆధ్వర్యంలో కడప జిల్లా మైలవరం మండలంలోని రాజా ఫౌండేషన్​లో ఘనంగా నిర్వహించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా 4 దశల్లో స్థానిక సమరం

Last Updated : Jan 23, 2021, 9:48 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details