ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NARA LOKESH: విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో ఆటలొద్దు: నారా లోకేశ్‌ - నారా లోకేశ్ వర్చువల్ సమావేశం

'ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు - విద్యా సంవత్సరం వృథా' అనే అంశంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులతో పలు అంశాలపై చర్చించారు.

Nara Lokesh Virtual Meeting
విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో ఆటలొద్దు

By

Published : Jun 16, 2021, 12:13 PM IST

పరీక్షల పేరిట విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడాలనుకుంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హెచ్చరించారు. విద్యావేత్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో 'ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు-విద్యా సంవత్సరం వృథా' అనే అంశంపై చర్చించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్‌తో ఆటలొద్దని హితవు పలికారు. ఇప్పటికే వారంతా తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సురేష్‌ రోజుకో విధంగా మాట్లాడుతున్నారని.. ఆయన అయోమయశాఖ మంత్రిలా ఉన్నారని ఎద్దేవా చేశారు. మూడో దశ ప్రారంభం కాకముందే పిల్లలపై కరోనా తీవ్రత కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details