వైకాపా ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా కాకినాడ మడ అడవులను నరికివేస్తున్నారని ఆరోపించారు. పర్యావరణాన్ని నాశనం చేస్తూ మత్స్యకారులకు జీవనాధారం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. కాకినాడకు తుపాను ముప్పు తెచ్చి పెడుతున్నారని అన్నారు. చట్టాలను అతిక్రమించే పాలకులు ఉన్నప్పుడు ఎన్ని చట్టాలు చేసుకుంటే ఏంటి అని దుయ్యబట్టారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో శాటిలైట్ ఫొటోలను జత చేశారు.
అలాంటి పాలకులు ఉన్నప్పుడు ఎన్ని చట్టాలు చేస్తేనేం..? - mangrove forests news
వైకాపా ప్రభుత్వం నిబంధనలు అతిక్రమిస్తూ కాకినాడ మడ అడవుల నరికివేతకు పాల్పడుతున్నారని నారా లోకేశ్ ఆరోపించారు.
nara lokesh tweet on kakinada mangrove forests
ఇదీ చదవండి :
పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం