ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రంగు... స్టిక్కర్... పేరు... మీ ఏడాది పాలన ఇదేనా?'

వేయగలిగితే రంగు, అంటించగలిగితే స్టిక్కర్, మార్చగలిగితే పేరు... ఏడాదిగా వైకాపా చేస్తున్న పాలన ఇదేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. కొత్త ఉద్యోగాల సంగతి లేకపోయినా.. ఉన్న ఉద్యోగాలే తీసేస్తున్నారని ఆరోపించారు. వైకాపా కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వేల మందిని రోడ్డు పడేశారని లోకేశ్ ట్వీట్ చేశారు.

'రంగు... స్టిక్కర్... పేరు...మీ ఏడాది పాలన ఇదేనా?'
'రంగు... స్టిక్కర్... పేరు...మీ ఏడాది పాలన ఇదేనా?'

By

Published : Jun 11, 2020, 5:34 PM IST

లోకేశ్ ట్వీట్

వైకాపా పాల‌న‌లో కొత్త ఉద్యోగాల కల్పన ఏమోగాని ఉన్న ఉద్యోగాలే తీసేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ విమర్శించారు. ఎంతోమందికి అండగా నిలిచిన ''ప్రజలే ముందు'' పరిష్కారవేదిక 1100 కాల్ సెంట‌ర్ కాంట్రాక్టును తన బంధువర్గానికి కట్టబెట్టడం కోసం నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వైకాపా కార్యకర్తల కోసం 2200 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించారని ఆరోపించారు.

వేయ‌గ‌లిగితే రంగు, అంటించ‌గ‌లిగితే స్టిక్కర్‌, మార్చగ‌లిగితే పేరు.. ఏడాదిగా వైకాపా పాల‌న‌ సాగిన విధానమని ఎద్దేవా చేశారు. 1100 కాల్‌ సెంటర్‌ను 1902గా మార్చారని, నిరుద్యోగ భృతి ఎత్తేశారని దుయ్యబట్టారు. కార్యకర్తలకు ఉద్యోగాల పేరుతో వేల‌మందిని రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి :కార్పొరేట్​ స్థాయిలో వైద్యం... కాయకల్పలో ప్రథమం

ABOUT THE AUTHOR

...view details