ఎస్సీల పట్ల జగన్ సర్కార్ వివక్ష ధోరణి పరాకాష్టకి చేరిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. బంగారు భవిష్యత్తు ఉన్న ఎస్సీ యువకుడు ప్రసాద్ నక్సలిజం వైపు వెళ్లాలనుకునే పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇసుక అక్రమాలకు అడ్డుపడ్డాడని శిరోముండనం చేసి చావగొట్టారని ఆక్షేపించారు.
'శిరోముండనం బాధితుడు నక్సలిజం వైపు వెళ్లే పరిస్థితి తెచ్చారు'
సీతానగరం శిరోముండనం ఘటన బాధితుడికి ఇంకా న్యాయం జరగలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. తనకు న్యాయం జరగలేదన్న ఆవేదనతో నక్సలిజం వైపు వెళ్లేందుకు ఆ యువకుడు సిద్ధపడ్డాడని లోకేశ్ అన్నారు. ఆ యువకుడికి సంబంధించిన ఓ వీడియోను లోకేశ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. వైకాపా పాలనలో అణగారిన వర్గాలకు న్యాయం జరగదని ఆక్షేపించారు.
నారా లోకేశ్
ఘటనకి కారణం అయిన వైకాపా నేతలపై చర్యలు లేకపోగా ప్రసాద్ని వేధిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. వైకాపా నియంతృత్వ పోకడలను ప్రశ్నిస్తే దళితులను చంపేస్తారా అని ఆయన నిలదీశారు. జరిగిన తప్పుకి ప్రభుత్వం ఎస్సీ జాతికి క్షమాపణ చెప్పి ప్రసాద్ కి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రసాద్ ఆవేదనకు సంబంధించిన ఓ వీడియోను లోకేశ్ ట్విట్టర్ లో విడుదల చేశారు.
ఇదీ చదవండి :నూతన పారిశ్రామిక విధానం...సింగిల్ విండో ద్వారా అనుమతులు