అమరావతి ఉద్యమం 150 రోజుల సందర్భంగా రైతు పోరాటానికి జయహో అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మద్దతు పలికారు. లాఠీ దెబ్బలు, అక్రమ కేసులతో పాటు ఆవేదనతో గుండెలు ఆగాయంటూ ఈ సందర్భంగా గుర్తుచేశారు. జై అమరావతి ఉద్యమాన్ని అణిచివేయడానికి వైకాపా ప్రభుత్వం అడ్డదారులు తొక్కినా రైతులు సహనం కోల్పోలేదని ఆయన కీర్తించారు. అణిచివేయాలనుకున్న ప్రతిసారీ జై అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం సాగుతున్న జై అమరావతి ఉద్యమం నేటితో 150 రోజులకు చేరుకుందన్న లోకేష్...తాము సైతం అంటూ భాగస్వామ్యం అయిన రైతులు, మహిళలు, యువత అందరికి వందనాలు తెలిపారు. భేషజాలకు పోకుండా ప్రభుత్వం ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని కొనసాగిస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రైతు పోరాటానికి 'జయహో': నారా లోకేశ్
అమరావతి ఉద్యమాన్ని అణిచివేయడానికి వైకాపా ప్రభుత్వం అడ్డదారులు తొక్కినా రైతులు సహనం కోల్పోలేదని తెదేపా నేత నారా లోకేశ్ కీర్తించారు. రాజధాని ఉద్యమం 150రోజులకు చేరుకున్న సందర్భంగా ట్విటర్లో లోకేశ్ పోస్ట్ చేశారు.
nara lokesh tweet on amaravathi agitation