ముఖ్యమంత్రి జగన్ తనకు తానుగా డిక్లరేషన్‌పై సంతకం చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హితవు పలికారు. భక్తుల మనోభావాలు గౌరవించాలని తేల్చిచెప్పారు. ఇతరులు ఏమంటున్నారనే దానితో సంబంధం లేకుండా బాధ్యత గల పౌరుడిగా, చట్టాలను అమలు చేయాల్సిన ఒక ముఖ్యమంత్రిగా జగన్ తన బాధ్యత నిర్వర్తించాలని లోకేశ్ కోరారు.
'భక్తుల మనోభావాలు గౌరవించి.. డిక్లరేషన్‌పై సంతకం చేయండి'
సీఎం జగన్.. డిక్లరేషన్‌పై సంతకం చేసి శ్రీవారిని దర్శించుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కోరారు. చట్టాలను అమలుచేయాల్సిన ఒక ముఖ్యమంత్రిగా జగన్ తన బాధ్యతను నిర్వర్తించాలన్నారు. భక్తుల మనోభావాలను గౌరవించాలని సూచించారు.
Nara lokesh