రాష్ట్రంలో జగన్ రౌడీ రాజ్యం నడుస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. రోజుకో ఎస్సీపై దాడి చెయ్యందే వైకాపా నాయకులకు నిద్ర పట్టడం లేదని మండిపడ్డారు. అనంతపురం జిల్లా, యాడికి మండలంలో రోడ్డు మరమతుల పని చేస్తున్న ఎస్సీ వర్గానికి చెందిన రాజు, ఇంజినీర్ పఠాన్ జమీర్పై వైకాపా నాయకుడు రమేశ్ అమానుషంగా దాడి చేసి దుర్భాషలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు.
శిరోముండనం, చంపడం, వేధింపులు, దాడులకు పాల్పడుతూ దళితులపై జగన్ ప్రభుత్వం దమనకాండ కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలపై దాడులకు దిగుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.