ఇళ్ల స్థలాల సేకరణలో జరిగిన అవినీతిలో 40మంది వైకాపా ఎమ్మెల్యేలు జైలుకెళ్లటం ఖాయమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జోస్యం చెప్పారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్న ఆయన త్వరలోనే వాటిని బయటపెడతామన్నారు. కనీసం 40 మంది జైలుకెళ్తారనే విషయం రాసి పెట్టుకోవాలని సవాల్ చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తుంటే తమపై దొంగ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారని... అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని తేల్చిచెప్పారు.
40 మంది వైకాపా నేతలు జైలుకెళ్లటం ఖాయం: లోకేశ్ - nara lokesh on Distribution of housing sites news
వైకాపా ఎమ్మెల్యేలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఇళ్ల స్థలాల సేకరణలో తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయంలో దాదాపు 40మందికి పైగా ఎమ్మెల్యేలు జైలుకెళ్లటం ఖాయమని జోస్యం చెప్పారు.
nara lokesh