భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై తెదేపా శవ రాజకీయాలు చేస్తుందని జగన్ అనడం.. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి.. తీర్థ యాత్రలకు బయలుదేరినట్టే ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. శవ రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అన్న విషయం మర్చిపోయినట్టు ఉన్నారని అన్నారు. ఆత్మహత్యలను అపహాస్యం చేస్తూ మాట్లాడటం ఇప్పటికైనా మానాలని లోకేశ్ హితవు పలికారు. జగన్‌కి చేతనైతే వైకాపా నేతల ఇసుక అక్రమ రవాణా అడ్డుకొని, సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్ల కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో వీరబాబు కుటుంబాన్ని పరామర్శించి వచ్చేలోపే మరో ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని లోకేశ్ ట్విట్టర్ ద్వారా కోరారు.
"కార్మికుల ఆత్మహత్యలను అపహాస్యం చేయటం సరికాదు" - ప్రభుత్వంపై ట్విట్టర్ల్లో లోకేష్ కామెంట్స్ వార్తలు
ఇసుక కొరతతో ఆత్మహత్యలకు పాల్పడిన ఒక్కొ కార్మిక కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఆత్మహత్యలను అపహాసం చేస్తూ మాట్లాడటం ఇప్పటికైనా మానుకోవాలని ట్వీట్ చేశారు.
nara lokesh satiers on ycp governament over sand issue
ఇదీ చదవండి : మాటిచ్చా.. నిలబెట్టుకున్నా.. ఆదుకున్నా: సీఎం జగన్