ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Nara Lokesh:వర్సిటీలను వైకాపా కార్యాలయాలుగా మార్చేశారు: నారా లోకేశ్​ - వర్సిటీల బదిలీలపై నారా లోకేశ్​ ఆగ్రహం

Nara Lokesh: వర్సిటీలను జగన్‌ వైకాపా కార్యాలయాలుగా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. వేధింపులతో ఉద్యోగి రాజీనామా... అరాచక పాలనకు అద్దంపడుతోందని దుయ్యబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Nara Lokesh
నారా లోకేశ్‌

By

Published : Aug 10, 2022, 10:38 AM IST

Nara Lokesh: యూనివర్సిటీలను జగన్ వైకాపా కార్యాలయాలుగా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పష్టంచేశారు. రెడ్డి రాజ్యంలో వేధింపులు తట్టుకోలేక పదవికి రాజీనామా చేస్తున్నానని ఒక బీసీ ఉద్యోగి ప్రకటించడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు అద్దంపడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ రెడ్డి సొంత సామాజిక వర్గం అధికారుల ఒత్తిడి తట్టుకోలేక అన్నమయ్య జిల్లా కలికిరి జేఎన్టీయూ సూపరింటెండెంట్ నాగభూషణం వీఆర్ఎస్ తీసుకుంటానని ప్రకటించడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ని అనంతపురం నుంచి అన్నమయ్య జిల్లా కలికిరికి బదిలీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెత్తనం మొత్తం ఒకే సామాజిక వర్గానికి అప్పజెప్పి బడుగు, బలహీన వర్గాల ఉద్యోగులను అణగదొక్కాలని చూస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో ఇదే పరిస్థితి నెలకొందని వాపోయారు. సీఎం కులపిచ్చ తగ్గించుకుని ఇతర సామాజికవర్గాల వారి ఆత్మ గౌరవం కాపాడాలని హితవుపలికారు. సూపరింటెండెంట్ నాగభూషణం స్పందన వీడియో ను తన ట్విట్టర్​కు లోకేష్ జత చేశారు.

ABOUT THE AUTHOR

...view details