'నవరత్నాలు వైకాపా నేతలకు... రాళ్లు ప్రజలకు' - నారా లోకేష్ తాజా వార్తలు
వైకాపా ప్రభుత్వ పాలనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఆరునెలల వైకాపా పాలనపై... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. వైకాపా 6 నెలల పాలనలో రత్నాలు అన్ని జారిపోయాయని... తెలుగుదనానికే గడ్డురోజులొచ్చాయని విమర్శించారు. జాతీయ గీతాన్నే మర్చిపోయినోళ్ళకు ఒక జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం ఏం చేతనవుతుందని పేర్కొన్నారు. నవరత్నాలు వైకాపా నాయకులు మింగి... రాళ్లు ప్రజల చేతిలో పెడుతున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఎంతమంది రైతులు, కౌలు రైతులకు భరోసా ఇచ్చారో చెప్పలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. సంక్షేమ కార్యక్రమాలకు రివర్స్టెండర్ పెట్టిన ఘనుడు సీఎం జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.