Jana Sena workers in Vishakhapatnam: విశాఖ విమానాశ్రయం ఘటన పేరుతో, పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. అరెస్ట్ చేసిన జనసేన నేతలను, కార్యకర్తలను వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ గదులను సోదా చేయడం, అక్కడ ఉన్న నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని లోకేశ్ ఖండించారు. విశాఖ గర్జన వైఫల్యం కావడంతో, ఆ ఉక్రోషం జనసేన నాయకులు, కార్యకర్తలపై చూపుతున్నట్లు కనిపిస్తుందని విమర్శించారు.
విశాఖ గర్జన వైఫల్యం.. జనసేనాపై వైకాపా ఉక్రోషం: నారా లోకేష్ - arrest of Jana Sena workers
Lokesh on Vishaka garjana : విశాఖ గర్జన విఫలం అక్కసును , వైకాపా ప్రభుత్వం జనసేనపై చూపిస్తోందని.. లోకేష్ ఎద్దేవా చేశారు. విశాఖ హోటల్లో బస చేసిన జనసేన నేతలను,కార్యకర్తలను అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
Lokesh on Vishaka garjana
Last Updated : Oct 16, 2022, 12:52 PM IST