ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పార్టీ రంగులేస్తారు కానీ విద్యుత్​ బిల్లులు రద్దు చేయలేరా..? - latest tweets of nara lokesh

విద్యుత్ బిల్లులను రద్దు చేసి ప్రజలను ఆదుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

nara lokesh
nara lokesh

By

Published : May 21, 2020, 11:11 AM IST

డబ్బు కోసం ప్రజలను పీల్చుకుతినే గత అలవాటు జగన్​కి అధికారంలోకి వచ్చాక కూడా పోలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అందుకే ప్రజలు లాక్ డౌన్ కష్టాల్లో ఉన్నా కూడా గుట్టుగా కరెంటు చార్జీలు పెంచి డబ్బు గుంజుతున్నారని మండిపడ్డారు.

లోకేశ్ ట్వీట్

పాలన అంటే ప్రజలను కష్టాల నుండి గట్టెక్కించడానికి, తప్ప కష్టాల్లోకి నెట్టడానికి కాదన్నది జగన్ గ్రహించాలని హితవు పలికారు. పార్టీ రంగులేయడానికి చేసిన వృథా ఖర్చుకన్నా 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దుచేస్తే వచ్చే నష్టం ఏమీలేదని స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లుల రద్దు చేసి ప్రజలను ఆదుకోవాలన్న లోకేశ్... కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు చేస్తున్న నిరసనలకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details