Nara Lokesh Reaction On Botsa comments : సీపీఎస్ రద్దుపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ అవగాహన లేకుండా హామీలిచ్చారని సజ్జల, బొత్స బహిరంగంగా చెబుతుంటే వారిపై ఎందుకు కేసులు పెట్టట్లేదని సీఎంను నిలదీశారు. జగన్ రెడ్డి పాలనా వైఫల్యాలపై సోషల్ మీడియాలో చిన్న విమర్శ చేస్తేనే.. తెలుగుదేశం కార్యకర్తలపై దేశద్రోహం కేసులు బనాయించి ఎలా వేధిస్తారని ప్రశ్నించారు.
Ministers committee discussions on CPS: సీపీఎస్ రద్దుపై తాము తొందరపడి హామీ ఇచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సీపీఎస్ రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. సీపీఎస్ రద్దుపై ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తే తామేం చేయలేమని స్పష్టం చేశారు. సీపీఎస్ కంటే మెరుగ్గా గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్)ను తీసుకొచ్చామని, దానిలోనూ మరిన్ని సదుపాయాలు పెంచుతున్నట్లు ఉద్యోగ సంఘాలకు వెల్లడించారు. మంత్రుల ప్రతిపాదనను ఉద్యోగ సంఘాల నాయకులు ముక్తకంఠంతో తిరస్కరించారు. పాత పింఛను విధానమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సీపీఎస్‌పై సచివాలయంలో బుధవారం జరిగిన చర్చలు ఎలాంటి నిర్ణయం వెలువడకుండానే ముగిశాయి. సీపీఎస్‌పై సచివాలయంలో బుధవారం ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక శాఖ, జీఏడీ అధికారులు సమావేశమయ్యారు.