Nara Lokesh Reacted On Ankababu Arrest: అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను జగన్‌రెడ్డి తండ్రి జైలుకు తీసుకెళ్లారు. ఇప్పుడు జగన్ రెడ్డి హయాంలో ఐఏఎస్‌లతోపాటు ఐపీఎస్‌లతో సహా పలువురు పోలీస్ అధికారులను.. జైలు పాలు చెయ్యబోతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విట్టర్లో స్పందించారు. కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్‌లో పడి కెరియర్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు.
జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్‌పై స్పందించిన నారా లోకేశ్ - స్పందించిన నారా లోకేశ్
Nara Lokesh: జర్నలిస్ట్ అంకబాబు అరెస్టును గుర్తు చేస్తూ.. ముఖ్యమంత్రి జగన్‌పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్లో విమర్శల వర్షం కురిపించారు. కోర్టు మొట్టికాయలు వేస్తున్నాఅధికారులు తీరు మారటం లేదని అన్నారు.
Etv Bharat
41ఏ నోటీసులు ఇవ్వకుండా, జర్నలిస్ట్ అంకబాబుని ఎందుకు అరెస్ట్ చేశారంటూ సీఐడీ అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. పదే పదే కోర్టు మొట్టికాయలు వేస్తున్నా అధికారులు తీరు మారడం లేదని విమర్శించారు. గీత దాటి ప్రవర్తిస్తున్న వారంతా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడంతోపాటు ఎందుకు తప్పు చేశామని.. జీవితాంతం బాధపడటం ఖాయమని లోకేశ్ హెచ్చరించారు.
ఇవీ చదవండి: