ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ గణాంకాలే.. జగన్ వైఫల్యాన్ని సూచిస్తున్నాయి : లోకేశ్ - tdp nara lokesh latest

రాష్ట్రంలో ప్రత్యక్ష పన్నుల ద్వారా వసూలైన ఆదాయం గణనీయంగా తగ్గుతూ వస్తోందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించడం.. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పతనాన్ని సూచిస్తోందని నారా లోకేశ్ అన్నారు. కార్పొరేట్ పన్నుల వసూళ్లు 15 శాతం తగ్గాయన్నారు.

nara lokesh on state taxes
nara lokesh on state taxes

By

Published : Feb 10, 2022, 7:53 PM IST

వైకాపా హ‌యాంలో.. రాష్ట్రంలో ప్రత్యక్ష ప‌న్నుల ద్వారా వ‌సూలైన ఆదాయం కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గుతూ వ‌స్తోంద‌ని కేంద్రమంత్రి పంక‌జ్ చౌద‌రి వెల్లడించ‌డం.. జగన్‌ పాలన వైఫల్యాన్ని సూచిస్తోందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు.

జగన్‌ రివ‌ర్స్ పాల‌న ఆరంభ‌మైన 2019-20లో రాష్ట్రం నుంచి ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి 20,928 కోట్లు చేరాయని.. 2020-21 నాటికి ఆ సంఖ్య 17,522 కోట్లకు దిగ‌జారిపోయిందని మండిపడ్డారు.

తెదేపా పాల‌నలో 2018-19 ఆర్థిక సంవ‌త్సరంలో 22,881 కోట్ల కార్పొరేటు ప‌న్నులు వ‌సూల‌య్యాయని గుర్తు చేశారు. కార్పొరేట్ ప‌న్నులు ఏటేటా త‌గ్గుతున్నాయంటే, రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైనట్లు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు లోకేష్.

ఇదీ చదవండి:కడప కేంద్ర జైలు ఇన్‌ఛార్జిగా వరుణారెడ్డి.. జిల్లాలో జోరుగా చర్చ!

ABOUT THE AUTHOR

...view details