ఏపీ కంటే పెట్రోల్ రూ.2.80, డీజిల్ రూ.3 తక్కువ అని పక్క రాష్ట్రంలో పెట్రోల్ బంకులు బోర్డులు పెట్టాయంటే సామాన్యులపై సీఎం జగన్ బాదుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క గాలి తప్ప అన్నింటి మీదా పన్నులు పెంచి ప్రజలను సీఎం జగన్ దండుకుంటున్నారని ఆరోపించారు.
గాలి తప్ప అన్నింటిపై పన్నులు పెంచారు: లోకేశ్ - petrol price at ap
ఏపీలో పెట్రోల్, డీజిల్ పన్నులపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కంటే తక్కువ ధరల్లో పెట్రోల్, డీజల్ అమ్ముతామని పక్క రాష్ట్రంలో పెట్రోల్ బంకులు బోర్డులు పెట్టాయని అన్నారు.
nara lokesh on petrol tax in andhra pradesh