డిపాజిట్లే కాదు పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా ఉండరనే భయంతోనే సీఎం జగన్ రాజధాని ప్రాంతంలో ఎన్నికలు పెట్టలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా పెనుమాకలో అమరావతి కోసం ఉద్యమిస్తోన్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. 80 గంటలు నిరాహార దీక్ష చేసిన రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఒకే రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు పోరాడతామన్నారు. ఇడుపులపాయలో రాజధాని అన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. అమరావతి కోసం ఆందోళన చేస్తున్న వారిని కేసులు పెట్టి వేధిస్తున్నారని... పోలీస్ స్టేషను ముఖం చూడని వ్యక్తులపై కేసులు పెట్టటం సరికాదని వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందని... అపుడు చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఆయనకు తెలుసు.. ఇక్కడ ఎన్నికలుంటే గెలవరని: లోకేశ్ - జగన్పై నారా లోకేశ్ కామెంట్స్ న్యూస్
ప్రపంచంలో కరోనా వైరస్ అందరినీ భయపెడుతోంటే... ఏపీలో జగనోరా వైరస్ నడుస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. మూడు ముక్కల రాజధానితో అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు.
nara lokesh on jagan