రైతే రాజు అనే రోజు తీసుకొస్తానని.. అసలు రైతే లేని రోజు జగన్ తీసుకొస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. వివిధ పథకాల ద్వారా రైతుకి ఏడాదిలో లక్ష రూపాయిల లబ్ధి అని, ఆఖరికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేక చేతులెత్తేశారని ఆక్షేపించారు. ఇచ్చిన ప్రతీ హామీ మోసమేనని, ఏకంగా ఉచిత విద్యుత్ పథకానికే మంగళం పాడే ప్రక్రియ మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఉచిత విద్యుత్ పథకాన్ని ఆపే ప్రక్రియ మొదలుపెట్టారు' - వైకాపా ప్రభుత్వంపై నారా లోకేశ్ ఆగ్రహం
వైకాపా ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని ఆపే ప్రక్రియ ప్రారంభించిందని నారా లోకేశ్ ఆరోపించారు. వైకాపా పాలన కారణంగా వలనే ఆత్మహత్యలు భారీ స్థాయిలో పెరిగాయని దుయ్యబట్టారు.

నారా లోకేశ్
15 నెలల్లో జగన్ రైతు వ్యతిరేక నిర్ణయాల వలనే ఆత్మహత్యలు భారీ స్థాయిలో పెరిగాయని దుయ్యబట్టారు. అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని విమర్శించారు. ఇకనైనా పబ్లిసిటీ పక్కన పెట్టి రైతన్నలను కాపాడాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: జీవిత బీమాకే 70 శాతం మిలీనియల్స్ మొగ్గు