అన్నదాతలపై కేసులు పెట్టడం జగన్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని నారా లోకేశ్ మండిపడ్డారు. కడుపు మండి రోడ్డెక్కిన రైతులని కేసుల పేరుతో వేధించడం దారుణమని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం చేతులెత్తేయడంతోనే రైతుల్ని దళారులు దోచుకుంటున్నారని విమర్శించారు.
అన్నదాతలపై కేసులు పెట్టడం దిగజారుడుతనమే: లోకేశ్ - lokesh about farmers arrest in nellore latest news
నెల్లూరు జిల్లా సంగంలో ధర్నా నిర్వహించిన రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు.
nara lokesh on farmers arrest in nellore