ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 4, 2020, 9:20 AM IST

Updated : Jul 4, 2020, 1:41 PM IST

ETV Bharat / city

అమరావతి ఉద్యమం.. విధ్వంస పాలనకు వ్యతిరేకం : లోకేశ్

వైకాపా ప్రభుత్వ మూడు ముక్కలాటకు ఇప్పటికే 64 మంది రైతులు బలయ్యారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి కోసం అన్నదాతలు 200 రోజులుగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోందని విమర్శించారు. ఒకే రాజధాని హామీ వచ్చే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

nara lokesh on amaravathi protest
నారా లోకేశ్

సీఎం జగన్​ మూడు రాజధానుల పేరుతో ఏపీని ముక్కలు చేయాలని చూస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. 3 ముక్కలాటకు ఇప్పటికే 64 మంది రాజధాని రైతులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 200 రోజులుగా అన్నదాతలు ఆందోళన చేస్తుంటే తేలిగ్గా తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ఇది విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమని ఉద్ఘాటించారు. 'ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని' అంటూ అమరావతి కోసం ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.

నారా లోకేశ్ ట్వీట్

కక్షసాధింపు కోసం అధికార దుర్వినియోగం

కక్ష సాధింపులో భాగంగానే మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేశారని లోకేశ్​ ఆరోపించారు. రాజకీయాల్లో మిస్టర్ క్లీన్‌గా ఉన్న ఆయన్ను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. అసమర్థ పాలనను ఎండగడుతూ రవీంద్ర పోరాడుతున్నందునే అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ తన అధికారాన్ని కేవలం కక్ష సాధింపునకు మాత్రమే వినియోగించుకుంటున్నారని విమర్శించారు.

ఇవీ చదవండి..

'అద్భుత రాజధాని అవకాశాన్ని ప్రభుత్వం దూరం చేసింది'

Last Updated : Jul 4, 2020, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details